Loading...|Vijayawada: --°C
అంతర్-జిల్లా టోర్నమెంట్ లో శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినుల ఛాంపియన్ షిప్
Andhra Pradesh - Telangana

అంతర్-జిల్లా టోర్నమెంట్ లో శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినుల ఛాంపియన్ షిప్

AI Media October 29, 2026 1 min read

ఏఐ మీడియా 24 (తిరుపతి – ప్రతినిధి): కర్నూలులోని ఆదర్శ జూనియర్ కళాశాలలో 10-10-2026 నుండి 12-10-2026 వరకు నిర్వహించిన 70వ ఎస్జీఎఫ్ రగ్బీ అంతర్-జిల్లా టోర్నమెంట్ (అండర్-19 బాలికల విభాగం) పోటీల్లో శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించారని ప్రిన్సిపాల్ డా. భువనేశ్వరి తెలిపారు. జి. చైతన్య లక్ష్మి (జూనియర్ ఎంపీసీ) – నేషనల్స్ కు ఎంపికైన, యు. హారిక (సీనియర్ ఎంఈసీ) – స్వర్ణ పతకం, కె. చంద్రకళ (సీనియర్ ఎంపీసీ) – స్వర్ణ పతకాలు సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, క్రీడల వల్ల శారీరక దృఢత్వం, మానసిక వికాసం, సామాజిక నైపుణ్యాలు, జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, ఒత్తిడి నివారణ వంటివి అలవడతాయని, చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, తితిదే కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ ఘనత సాధించిన విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సాయి సుమతిని అభినందించారు.

Leave a Comment