జూడో జాతీయ పోటీల్లో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినిలు
ఏఐ మీడియా 24 (తిరుపతి – ప్రతినిధి): శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినిలు తిరుపతి జిల్లాలోని తనపల్లి శశి పాఠశాలలోఅక్టోబర్ 12 నుంచి 14 వరకు జరిగిన జూడో పోటీల్లో సి. అనిత ద్వి. సం. సి ఇ సి , స్వర్ణ పతకం -జాతీయస్థాయికి ఎంపిక, టి. లలిత ద్వి. బై పి సి స్వర్ణ పతకం, జాతీయ స్థాయికి ఎంపిక , కె. దీక్ష శ్రీ ప్ర. సం. ఎమ్ ఇ సి కంచు మెడల్ గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డా. భువనేశ్వరి తెలిపారు శారీరక ధ్రుడత్వం, ఆత్మవిశ్వాసం శరీర నియంత్రణ , మానసిక వికాసం, సామాజిక నైపుణ్యాలు, జట్టు స్ఫూర్తి, క్రమశిక్షణ, ఒత్తిడి నివారణ అలవడుతాయని చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టిటిడి కల్పిస్తున్న అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పిడి సాయి సుమతిని ప్రత్యేకంగా అభినందించారు.
